జీలకర్ర నీళ్లు ఇంత పవరా? ఉదయాన్నే తాగితే జరిగేదిదే..!
జీలకర్ర నీళ్లకు జీర్ణ ఎంజైమ్ ల సంశ్లేషణను పెంచే సామర్థ్యం ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి సమస్యలు ఈజీగా తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి ఇది బెస్ట్ డ్రింక్. శరీరంలోని వివిధ భాగాలలో అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ప్రీరాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడటంలోనూ, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సమర్థవంతంగా సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి మంచిది.
రోగనిరోధక శక్తి పెంచడానికి జీలకర్ర నీళ్ళు సహాయపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడతాయి.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గించేందుకు జీలకర్ర నీళ్లు సహాయపతాయి.
జీలకర్రలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్రోన్కైటిస్, ఆస్తమా వంటి శ్వాస సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఉదయాన్నే జీలకర్ర నీళ్లు తాగితే శరీరం శుద్ది అవుతుంది. మొటిమలు, మచ్చలు, ముడుతలు వంటివి తగ్గి చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
నెలసరి సమయంలో మహిళల కడుపు నొప్పి, తిమ్మిరి, ఋతుస్రావం ఎక్కువ కావడం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది.