ఉదయాన్నే అల్లం, తులసి నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

నాలుగు తులసి ఆకులు, అర అంగుళం అల్లాన్ని గ్లాసు నీటిలో మరిగించి ఖాళీ కడుపుతో తాగాలి. 

ఉదయం ఖాళీ కడుపుతో అల్లం, తులసి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

అల్లం, తులసి నీరు తాగడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

అల్లంలోని జింజెరాల్ శరీరంలో కొవ్వును తగ్గించడలో సాయపడుతుంది. 

తులసి లోని యాంటీ వైరల్, యాంటీ కొలెస్ట్రాల్ లక్షణాలు గుండెకు మేలు చేస్తాయి.

రోజూ ఈ పానీయం తాగడం వల్ల నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. 

శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో అల్లం, తులసి నీరు సాయపడుతుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే.. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.