ఇమ్యూనిటీ పెరగాలంటే.. ఉదయాన్నే ఈ టీ తాగితే చాలు..!

ఇమ్యూనిటీ పెరగడానికి లెమన్ టీ సహాయపడుతుంది.  ఉదయాన్నే దీన్ని తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

లెమన్ టీలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది.

జీర్ణక్రియ ఎంజైమ్ లను ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది.

 లెమన్ టీ లో కేలరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునేవారు పాలతో చేసే టీ బదులు లెమన్ టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

శరీరంలో టాక్సిన్లను శుద్దిచేయడానికి లెమన్ టీ సహాయపడుతుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

లెమన్ టీలో ఉండే విటమిన్-సి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

లెమన్ టీ సువాసన చాలా బాగుంటుంది. ఇది మైండ్ రిఫ్రెష్ కావడానికి, మానసిక సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది.

ఇందులో కొద్దిపాటి ఆల్కలీన్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో PH స్థాయిలు నిర్వహించడానికి సహాయపడతాయి.

లెమన్ టీ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపులు, నొప్పులు, మంట తగ్గించడంలో సహాయపడతాయి.