బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల  జీర్ణ సమస్యలను, పేగుల్లో వాపు తగ్గుతుంది. 

డెంగీ కారణంగా తగ్గే ప్లేట్‌లెట్స్‌ను పెంచడంలో బొప్పాయి ఆకుల రసం బాగా పని చేస్తుంది. 

బొప్పాయి ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. 

తరచూ బొప్పాయి ఆకు రసం తీసుకుంటే గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. 

బొప్పాయి ఆకుల్లోని ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు శరీరంలో మంటను తగ్గించడంలో సాయపడతాయి. 

బొప్పాయి ఆకుల్లోని అసిటోజెనిన్ కాలేయంలో మలినాలను తొలగించడంలో దోహదం చేస్తుంది. 

బొప్పాయి ఆకు రసరం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.