ఉదయం పైనాపిల్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పైనాపిల్, పసుపు, పుదీనా, లవంగాలు తదితరాలతో చేసే టీ ఆరోగ్యానికి మంచిది. 

పైనాపిల్‌లోని విటమిన్-సీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల ఈ టీ చర్మ ఆరోగ్యానికి బాగా పని చేస్తుంది.

కడుపు ఉబ్బరం, అజీర్ణ సమస్యలను తగ్గించడంలో ఈ టీ బాగా పని చేస్తుంది. 

రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పైనాపిల్ టీ సహకరిస్తుంది.

పైనాపిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు.. ఫ్రీరాడికల్స్, టాక్సిన్‌లను తొలగించడంలో బాగా పని చేస్తాయి.

పైనాపిల్ టీ శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది.

బరువును అదుపులో ఉంచడంలో పైనాపిల్ టీ దోహదం చేస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.