పూలతో తయారు చేసే టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

జాస్మిన్ పూల ద్వారా చేసే టీ తాగడం వల్ల జీర్ఱక్రియ పెరగడంతో పాటూ బ్యాక్టీరియా దూరమవుతుంది. 

లావెండర్ ఆకులతో చేసే టీ తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటూ మంచి నిద్ర పడుతుంది.

మందార టీని తీసుకుంటే కమ్మటి రుచితో పాటూ శరీరంలో కొలెస్ట్రాల్‌‌ను తగ్గిస్తుంది. 

రోజ్ టీ మంచి సువాసన అందించడంతో పాటూ హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడంలో సాయపడతాయి. 

చామంతి పూలతో చేసే టీ తాగడం వల్ల నొప్పులు తగ్గడంతో పాటూ గుండెకూ మేలు కలుగుతుంది.