రాత్రి వేళల్లో నీరు ఎక్కువగా తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

రాత్రిళ్లు నీరు ఎక్కువగా తాగడం వల్ల పదే పదే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. 

తరచూ మూత్రవిసర్జన చేయడం వల్ల మూత్రాశయ సమస్యలు తలెత్తవచ్చు.

మూత్రవిసర్జన ఎక్కువ చేసే కొద్దీ.. మళ్లీ మళ్లీ దాయం కూడా వేస్తుంది. 

రాత్రిళ్లు పదే పదే మేల్కోవడం వల్ల శరీర సహజ గడియారం దెబ్బతింటుంది.

నిద్ర సరిగా లేకపోవడం వల్ల మరుసటి రోజంతా మానసిక స్థితి సరిగా ఉండదు. 

రాత్రి ఎక్కువ నీరు తాగితే కడుపుతో గ్యాస్ ఏర్పడి ఉబ్బరంగా మారుతుంది. 

మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. 

రక్తంలో ఉప్పు శాతం తగ్గి.. శరీరంలోని అవయవాల వాపునకు కారణమవుతుంది. 

శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయి తగ్గిపోయి.. కండరాల తిమ్మిరి సమస్యలు తలెత్తవచ్చు.