ఎండు ద్రాక్షను రాత్రంతా నానబెట్టి.. ఉదయం ఆ నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఎండు ద్రాక్షలోని పొటాషియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. 

ఎండు ద్రాక్ష నీరు మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

ఈ ద్రాక్షలోని సహజ చక్కెరలు శరీరానికి శీఘ్ర శక్తిని అందిస్తాయి. 

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎండు ద్రాక్షలోని పొటాషియం సాయం చేస్తుంది. 

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది బాగా పని చేస్తుంది. 

బరువును నియంత్రణలో ఉంచడంలో ఎండు ద్రాక్ష దోహదం చేస్తుంది. 

ఎముకలను బలోపేతం చేయడంలో ఇవి సాయం చేస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.