నిలబడి నీళ్లు తాగితే ఇంత డేంజరా

 నీరు సమస్తకోటికి ప్రాణాధారమని తెలుసు. మానవ శరీరం కూడా 70 శాతం నీటితోనే నిర్మితమై ఉంటుంది. 

పరిగెత్తి పాలు తాగడం కన్నా, నిలబడి నీళ్లు తాగాలని ఓ సామెత ఉంది. అలా నిలబడి నీరు తాగితే ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం. 

కిడ్నీ సమస్యలు: నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సంబంధిత  సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులైతే నిలబడి నీళ్లు తాగవద్దు.

ఆర్థరైటిస్ సమస్యలు: కీళ్లనొప్పులు ఉన్నవారు నిలబడి నీళ్లు తాగకూడదు. అలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయి. 

ఊపిరితిత్తుల సమస్యలు: నిలబడి నీరు తాగడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. తద్వారా ఊపిరితిత్తులపై చెడు ప్రభావం పడుతుంది.

జీర్ణక్రియ: నిలబడి నీరు తాగితే జీర్ణవ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో నొప్పిగా ఉంటుంది. 

అందుకే కూర్చొని నీరు తాగాలి. ఒకేసారి నీళ్లు తాగే బదులు చిన్న చిన్న గుటకలుగా మింగాలి. నెమ్మదిగా నీటిని తాగడం ద్వారా, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌గా ఉంటాయి. శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలు అందుతాయి.