ఈ వర్షాకాలంలో పచ్చి అల్లం తినండి.. ఈ సమస్యలన్నీ దూరమవుతాయి..!
వర్షాకాలంలో పచ్చి అల్లం తినడం వల్ల పలు సీజనల్ వ్యాధులు దూరమవుతాయి. గొంతు నొప్పి, జలుబు, జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లంలో జింజెరాల్ అనే బయో యాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
రక్తపోటును, చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా అల్లం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అల్లం లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే జీర్ణక్రియను సులభతరం చేసి గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది. గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అల్లం నొప్పి నివారిణి లక్షణాలను కలిగి ఉంటుంది. మహిళలో రుతుక్రమంలో వచ్చే నొప్పి, కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
వాంతులు, వికార లక్షణాలు కనిపించినపుడు అల్లం నమిలితే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
అల్లంలో సెలీనియం, ఎర్గోథియోనిన్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి పలు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.
మెటబాలిజాన్ని పెంచడం, కొవ్వును కరిగించే లక్షణాలు కలిగి ఉన్న అల్లం బరువు నిర్వహణకు బాగా ఉపయోగపడుతుంది.
ఇన్సులిన్ సెన్సిటివిటీపై అల్లం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.