ఎంత వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే ఇవి తినండి చాలు..!

కాలంతో పాటు వయసు పెరుగుతుంది.  వయసు పెరిగేకొద్ది శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి.

చర్మం ముడుతలు పడటం, శరీరంలో మార్పులు, జుట్టు రంగు మారడం వంటివి జరుగుతాయి.

అయితే కొన్ని ఆహారాలు ఈ వృద్దాప్య ప్రక్రియను నెమ్మది చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే..

రెడ్ క్యాప్సికం.. ఎర్ర రుంగు క్యాప్సికమ్ లో  ఉండే  యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి వృద్దాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి.

చిలకడ దుంపలు.. చిలకడ దుంపలలో చర్మాన్ని యవ్వనంగా ఉంచే మూలకాలు ఉంటాయి.  ఇవి వృద్దాప్యాన్ని నెమ్మది చేస్తాయి.

పాలకూర.. పాలకూర తీసుకోవడం వల్ల వృద్దాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది.

డ్రై ఫ్రూట్స్.. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల యవ్వనంగా ఉండవచ్చు.  రోజూ ఓ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి.

బెర్రీ.. బెర్రీ జాతికి చెందిన పండ్లు అయిన స్ట్రాబెర్రీ,  బ్రూ బెర్రీ, బ్లాక్ బెర్రీ మొదలైవని యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం మంచిది. 

గుడ్లు.. గుడ్లలో బయోటిన్,  వృద్దాప్యాన్ని నెమ్మదించే గుణాలు ఉంటాయి.