ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!
వర్షాకాలం సూర్యరశ్మి సరిగా లేకపోవడం వల్ల విటమిన్-డి లభించదు. అయితే కొన్ని ఆహారాలు తీసుకుంటే విటమిన్-డి లోపం రాకుండా జాగ్రత్త పడవచ్చు.
పాలు..పాలు రెగ్యులర్ గా తీసుకుంటే విటమిన్-డి లోపం దరిచేరదు. ఇందులో ప్రోటీన్, కాల్షియం కూడా ఉంటాయి.
ఆరెంజ్ జ్యూస్..ఆరెంజ్ జ్యూస్ కూడా విటమిన్-డి కి మూలం. రోజూ ఒక నారింజ పండు తింటూ విటమిన్-డి లోపం రాకుండా చూసుకోవచ్చు.
పెరుగు..
పాలలాగే పెరుగు కూడా విటమిన్-డి లోపం రాకుండా చేస్తుంది. రోజూ పెరుగు తినాలి.
చేపలు..
సాల్మన్, మాకేరెల్, ట్యూనా వంటి చేపలలో ప్రోటీన్లు, ఒమెగా ఫ్యాట్ లు అధికం. వీటిని తీసుకుంటే విటమిన్-డి లోపం రాదు.
గుడ్డు సొన..
ఆహారంలో గుడ్లలోని పచ్చ సొన తీసుకుంటే విటమిన్-డి భర్తీ అవుతుంది. వర్షాకాలంలో పచ్చసొన తప్పక తినాలి.
తృణధాన్యాలు..
తృణధాన్యాలు శరీరానికి బలాన్నే కాదు.. విటమిన్-డి ని కూడా అందిస్తాయి. వీటిని అల్పాహారంలో భాగంగా తీసుకుంటే విటమిన్-డి లోపం రాదు.
చీజ్..
పాలు, పాల సంబంధిత పదార్థాలలో విటమిన్-డి ఉంటుంది. జున్ను, చీజ్, చెడ్డార్, స్విస్ వంటి చీజ్ రకాలలో విటమిన్-డి ఉంటుంది.
పుట్టగొడుగులు..
పుట్టగొడుగుల ద్వారా విటమిన్-డి పుష్కలంగా పొందవచ్చు. మరీ ముఖ్యంగా వీటిని వండేముందు కొంచెం సేపు ఎండలో ఉంచితే మరింత విటమిన్-డి లభిస్తుంది.
మొక్కల ఆధారిత పాలు..
సోయా, బాదం, ఓట్స్ వంటి వాటి నుండి తయారుచేసే పాలు తీసుకుంటే విటమిన్-డి లభిస్తుంది.
సార్డినెస్..
భోజనంలో సార్డినెస్ చేపలను చేర్చడం వల్ల విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది. వీటిలో ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.