ఈ ఒక్క పండు తింటుంటే చాలు.. కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చట..

కంటిశుక్లం కంటిచూపును దెబ్బతీస్తుంది.  దీన్ని నిర్లక్ష్యం చేస్తే చూపు పోవడానికి  కారణం అవుతుంది.

సాధారణంగా వయసు పెరిగేకొద్ది కంటిశుక్లం సమస్య వస్తుంటుంది. కానీ ఇప్పట్లో చిన్న వయసు వారిలో కూడా ఈ సమస్యలు వస్తున్నాయి.

శీతాకాలంలో.. ముఖ్యంగా కార్తీక మాసంలో అందుబాటులోకి వచ్చే  ఉసిరికాయలు తింటే కంటిశుక్లానికి చెక్ పెట్టవచ్చట.

ఉసిరికాయలో  యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి.

ఉసిరిలో ఉండే పోషకాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడంలో ఉసిరికాయలు ఎఫెక్టీవ్ గా ఉంటాయి.

ఉసిరిలో ఉండే విటమిన్-సి దృష్టిలోపాలు తొలగిస్తుంది. కళ్లకు సంబంధించిన సమస్యలను రానీయదు.

ఉసిరికాయ తింటే కంటి లెన్స్ లోని టెన్షన్ తగ్గుతుందట. ఈ కారణంగా ఇది కంటిశుక్లానికి చెక్ పెడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

రోజూ ఒకటి లేదా రెండు ఉసిరికాయలు తినవచ్చు.  లేదంటే ఉసిరికాయ పొడిని వేడి నీటిలో కలిపి తాగవచ్చు.