రోజూ ఓ చిన్నముక్క దాల్చిన చెక్క తింటే.. జరిగేదిదే..!

దాల్చిన చెక్క సుప్రసిద్ద మసాలా దినుసు. దీన్ని రోజూ ఓ ముక్క తింటే చాలా ప్రయోజనాలు చేకూరతాయి.

 యూజినాల్, లినాలూల్, హెస్పెరిడిన్ అనే ప్లేవనాయిడ్లు  ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడతాయి.

 యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు  పుష్కలంగా ఉండటం వల్ల ప్యాంక్రియాటిక్ కణాలను రక్షిస్తాయి. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

 జీవక్రియ వేగం పెంచి శరీర కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో మెరుగ్గా పనిచేస్తుంది.

నోటిలో బ్యాక్టీరియాను నిర్మూలించి పంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

కేంద్ర నాడీ వ్యవస్థలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది.  సెరోటోనిన్ ను పెంచడం ద్వారా సంతోషంగా ఉంచుతుంది.

దాల్చిన చెక్క శరీరంలో ఎంజైమ్ ల స్థితిని మెరుగుపరుస్తుంది. పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.

ఇందులో ఉండే యూజినాల్, సిన్నమాల్డిహైడ్..   క్యాన్సర్ కణాల అభివృద్దిని నివారిస్తాయి.

దాల్చిన చెక్కలో ఉండే రసాయనాలు రోగనిరోధక వ్యవస్థను చురుగ్గా మారుస్తాయి. సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి.

ఇందులో కామోద్దీపనను కలిగించే రసాయనాలుంటాయి. ఇవి శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.