వర్షాకాలంలో ఎక్కువగా దొరికే నేరుడుపండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

నేరేడుపండ్లలో పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

రక్తపోటును నియంత్రించడంలో నేరేడు పండ్లు బాగా పని చేస్తాయి. 

చర్మం కాంతివంతంగా మారడానికి కూడా ఈ పండ్లు ఉపయోగపడతాయి. 

మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడుపండ్లు ఎంతో మేలు చేస్తాయి. 

నేరుడుపండ్లలోని పోటాషియం గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. 

ఈ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు ధూమపానం వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. 

రోగనిరోధక శక్తి పెంపొందించడంలోనూ నేరేడుపండ్లు బాగా పని చేస్తాయి. 

దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ ఈ పండ్లు బాగా పని చేస్తాయి.