ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్తుంటారు. ఎన్ని ఆస్తులున్నా ఆరోగ్యం లేకపోతే వ్యర్ధమే.

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రోటీన్ పుష్కలంగా ఉండే పప్పులను తరచూ ఆహారంగా తీసుకోవాలి.

అలాంటి పప్పుదినుసుల్లో ఒకటే బొబ్బర్లు. దీని ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

వీటిలో విటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

బొబ్బర్లలో క్యాలరీలు, కొవ్వులు, అధిక పీచు పదార్థం ఉండటం వల్ల అధిక బరువు తగ్గించుకోవచ్చు.

బొబ్బర్లలో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించి షుగర్ వ్యాధిని కంట్రోల్‌ చేస్తాయి.

బొబ్బర్లు రక్తంలో ఉన్న ట్రై గ్లిజరైడ్స్ తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. హృదయ సంబంధిత రోగాలు దరి చేరవు.

బొబ్బర్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్, పొటాషియం, మెగ్నీషియం, మినరల్స్ మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

బొబ్బర్లలో అధికంగా ఉండే ఫైబర్ వల్ల మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

బొబ్బర్లలో ఉండే అధిక ప్రోటీన్ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బొబ్బర్లను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.