ఈ డ్రై ఫ్రూట్స్‌ నానబెట్టి తింటే అమృతమే

జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్షలను తేనెలో నానబెట్టి తింటే అమృతమేనంటున్నారు వైద్యులు

జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్షలను తేనెలో కలిపి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. చెడు కొవ్వును నియంత్రిస్తుంది

తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

జీడిపప్పు, తేనె, ఎండుద్రాక్షలను తేనెలో నానబెడితే వాటిలో పోషకాలు రెట్టింపు అవుతాయి. వీటిని తింటూ ఉంటే జుట్టు, గోళ్లు, చర్మం, ఎముకలు బలపడతాయి. 

బాదంలో ప్రొటీన్, ఫైబర్, విటమిన్-ఇ, మెగ్నీషియం, కాపర్, ఐరన్, పొటాషియం తదితర పోషకాలుంటాయి. 

జీడిపప్పులో కాపర్, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు.. విటమిన్-కె, ఇ, విటమిన్-బి విటమిన్లు కూడా ఉంటాయి.

ఎండుద్రాక్షలో ప్రొటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం, కాపర్, విటమిన్-బి6, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.

తేనెలో శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు చాలా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్-బి6, విటమిన్-సి, అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.