ఎండు ఖర్జూరాలను నానబెట్టి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రోజూ ఉదయం ఎండు ఖర్జూరాలను నానబెట్టి తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

ఖర్జూరాల్లోని విటమిన్ బి6, మాంగనీస్ తదితరాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ఖర్జూరాలు దోహదం చేస్తాయి. 

ఎండు ఖర్జూరాల్లోని విటమిన్-సి, ఏ, యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని సంరక్షిస్తాయి. 

వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడంలో ఎండు ఖర్జూరాలు సాయం చేస్తాయి. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.