రోజూ పాలు, గుడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. అయితే పాలు తాగిన తర్వాత గుడ్లు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాలు, గుడ్లలో అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. దీంతో వీటిని కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
పాలు తాగిన తర్వాత గ్యాప్ తీసుకోకుండా పచ్చి గుడ్లు తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
పాలు తాగిన వెంటనే పచ్చి గుడ్లు తినడం వల్ల కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
పాలు, పచ్చి గుడ్లు వెంట వెంటనే తీసుకోవడం వల్ల అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.
గ్యాప్ లేకుండా ఈ రెండింటినీ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఇది గుండె సమస్యకు దారి తీయొచ్చు.
పాలు, గుడ్లు కలిపి తీసుకోవడం వల్ల మలమద్దకం సమస్య పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమస్య ఉంటే గ్యాప్ ఎక్కువ తీసుకోవాలి.
ఇది అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆనారోగ్య సమస్యలు తలెత్తినా.. వైద్యుడిని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి.