నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందంటే..!

నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు రోగనిరోధక శక్తికి పవర్ హౌస్ లాంటివి

 విటమిన్-ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, మంచి కొవ్వులు, బ్యూట్రిక్ యాసిడ్  ఈ మిశ్రమంలో ఉంటాయి. ఇవన్నీ  సూపర్ ఇమ్యూనిటీ ఇస్తాయి.

ఇందులో డైటరీ ఫైబర్, బ్యూట్రిక్ యాసిడ్ ఉంటాయి. ప్రేగు కదలికలను సాఫీగా చేసి  జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిస్తుంది.

ఈ మిశ్రమంలో పొటాషియం, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తుంది.

ఎక్కువ మొత్తంలో  ఖనిజాలు, విటమిన్లు, హార్మోన్ల ఉత్పత్తిని పెంచే సమ్మేళనాలు ఇందులో ఉంటాయి.

నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే మహిళలలో  నెలసరి సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, మెనోపాజ్ సమస్యలు తగ్గుతాయి. మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయి కుడా సమతుల్యంగా ఉంటుంది.

ఖర్జూరం సహజ శక్తిని ఇస్తే, నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ ఎక్కవసేపు శక్తిని నిలిపి ఉంచుతుంది. రెండూ కలిపి తింటే శరీర ధృడత్వం పెరుగుతుంది.