పచ్చి మిరపను తినడం వల్ల  ఎన్ని లాభాలున్నాయో తెలుసా..

పచ్చి మిరపను తినడం వల్ల అనేక  ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

పచ్చి మిరపలోని విటమిన్-సి..  మీ శరీరానికి హాని చేసే ఫ్రీ  రాడికల్స్ నుంచి రక్షిస్తుంది.

చర్మం, ఎముకలు,  కణజాలానికి అవసరమైన  కొల్లాజెన్ ఉత్పత్తికి సాయం చేస్తుంది.

పచ్చి మిరపలోని B6, B9 విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

పచ్చి మిర్చిలోని కెరోటినాయిడ్లు  మీ కంటి చూపు మెరుగుపడేందుకు దోహదం చేస్తాయి.

రక్తం గడ్డ కట్టడంలో పచ్చి మిర్చిలోని విటమిన్ కే-1 సాయం చేస్తుంది. 

పచ్చిమిర్చిలోని పొటాషియం రక్తపోటు, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.