ఫ్రిజ్‌లో నిల్వ చేసిన  మాంసాన్ని తింటున్నారా..  అయితే డేంజర్..

 అవసరమైన దాని కంటే అధికంగా మాంసం తెచ్చినప్పుడు, రేపటి కోసం తెచ్చినప్పుడు దాన్ని నిల్వ చేసేందుకు సాధారణంగా మనం ఫ్రిజ్‌లో పెడుతుంటాం

అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిల్వ చేసిన మాంసాన్ని తినొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలా నిల్వ చేసిన మాంసంపై రకరకాల బ్యాక్టీరియా చేరుతుందని, దాన్ని వండుకుని తింటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ఫ్రిజ్‌లో పెట్టిన మాంసంపై ఈకొలి అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరుతుంది.

 అలాంటి మాంసాన్ని ఫ్రిజ్ నుంచి బయటకు తీసే సమయంలో చేతులకు అంటుకునే అవకాశం ఉంది. తద్వారా నోరు, ముక్కు నుంచి అది శరీరంలోకి ప్రవేశిస్తుంది.

ఈకొలి పొట్టలోకి చేరి అనేక అనారోగ్యాలు కలిగిస్తుంది.

ఈకొలి బ్యాక్టీరియా పొట్టలోకి చేరినప్పుడు ముఖ్యంగా మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ ప్రమాదం పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు

అలాగే కొందరికి ఫుడ్  పాయిజన్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.