తాటి బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
తాటి చెట్టు నుంచి వచ్చే నీరాను మరిగించి, ఎలాంటి రసాయనాలు లేకుండా తాటి బెల్లం తయారు చేస్తారు.
మధుమేహ రోగులు చక్కెరకు బదులుగా ఈ బెల్లం వాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తగ్గించడంలో తాటి బెల్లం సాయం చేస్తుంది.
శ్వాసకోశ వ్యాధులను నివారించడంలో తాటి బెల్లం దోహదం చేస్తుంది.
ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చే గుణాలు తాటి బెల్లంలో ఉన్నాయి.
ఆహారం జీర్ణం కావడానికి ఈ తాటి బెల్లం బాగా పని చేస్తుంది.
తాటి బెల్లంలోని ఐరన్.. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
తాటి బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు.. రక్తాన్ని శుద్ధి చేసి, దెబ్బతిన్న కణాలను బాగు చేస్తాయి.
మలబద్ధక సమస్యను నివారించడంలోనూ తాటి బెల్లం సహకరిస్తుంది.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
వర్షాకాలంలో వ్యాపించే సాధారణ అనారోగ్యాలు..
వెన్నునోప్పి నుండి ఉపశమనం పోందాలంటే..
కిడ్నీ పనితీరును పెంచే సూపర్ ఫుడ్స్
యూరిక్ యాసిడ్ స్థాయితో ఇబ్బంది పడితే ఈ ఫుడ్స్ తినొద్దు..