చలికాలంలో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

శీతాకాలంలో ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తిని, గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. 

తర్వాత కనీసం 30 నిముషాల పాటు ఏమీ తినకూడదు. 

ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల మలబద్ధక సమస్య దూరమవుతుంది. 

పొట్టను శుభ్రం చేసుకోవాలనుకునే వారు ఇలా చేయడం ఉత్తమం. 

చెడు కొలస్ట్రాల్‌ను తొలగించడంలో పచ్చి వెల్లుల్లి సాయం చేస్తుంది. 

అధిక రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. 

జలుబు, దగ్గుకు కారణమయ్యే వైరస్, బ్యాక్టీరియా తొలగిపోతుంది. 

బలహీనతను అదిగమించి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు వెల్లుల్లి సాయం చేస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.