రోజూ ఒక స్పూన్ నువ్వులు తింటే ఈ సమస్యలు ఉన్నవారికి భలే లాభాలు..!
నువ్వులు ఎన్నో ఏళ్ల నుండి సాంప్రదాయ ఆహారంలో భాగంగా ఉంటున్నాయి.
నువ్వులలో ప్రోటీన్, విటమిన్-బి, ఐరన్, కాల్షియం, ఫైబర్ తో సహా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
గుండె సమస్యలు ఉన్నవారు నువ్వులు తీసుకుంటే వాటిలో ఉండే మోనోశాచురేటెడ్, పాలీశాచురేటెడ్ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
నువ్వులలో కాల్షియం, జింక్, పాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఎముకలు బలహీనంగా ఉన్నవారు నువ్వులు తింటే ఎముకలు బలంగా ఉంటాయి.
నువ్వులలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వులు తినాల్సిందే. నువ్వులలో ఉండే విటమన్-ఇ సహా అనేక పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి.
నువ్వులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంట, వాపులను తగ్గిస్తాయి.
నువ్వులలో మెగ్నీషియం ఉంటుంది. మధుమేహం ఉన్నవారు నువ్వులు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడుతుంది.
Related Web Stories
కొబ్బరి పువ్వు తింటే ఇన్ని లాభాలా..
ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు!
మీకు స్వీట్ కార్న్ అంటే ఇష్టమా? అయితే మీరు లక్కీ..!
గుర్రపు ముల్లంగి ఉపయోగాలు తెలుసా