రోజూ మొలకెత్తిన  వేరుశెనగలను తింటే  ఎన్ని లాభాలంటే.. 

మొలకెత్తిన వేరుశెనగల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

పొట్ట ఎక్కువ సేపు నిండినట్లుగా ఉంటుంది. తద్వారా బరువు తగ్గేందుకు వీలుంటుంది. 

వేరుశెనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

వేరుశెనగల్లోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. 

రోగనిరోధక  శక్తి పెరుగుతుంది. 

మొలకెత్తిన వేరుశెనగల్లోని విటమిన్-ఇ.. చర్మ ఆరోగ్యానికి సహకరిస్తుంది. 

వేరుశెనగల్లోని ప్రొటీన్లు, ఇతర పోషకాలు జుట్టుకు పోషణ అందిస్తాయి.