వామ్మో.. ఈ పండ్లు తినకండి బాబూ.. బరువు పెరుగుతారు..

పండ్లు తింటే బరువు తగ్గుతారని అనుకుంటారు.  ఈ కారణంగా దొరికిన పండ్లు తినేవారు చాలామంది ఉన్నారు.

అయితే కొన్ని పండ్లు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. వీటిలో చక్కెర శాతం, కేలరీల కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది.

మామిడి పండ్లలో చక్కెర శాతం,  కేలరీలు ఎక్కువ.  లిమిట్ దాటి తింటే బరువు పెరుగుతారు.

అరటిపండ్లలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. కేలరీలు పుష్కలంగా ఉంటాయి.  ఎక్కువగా తింటే బరువు పెరగడం సులభం.

సీతాఫలంలో కేలరీలు ఎక్కువ, చక్కెర శాతం ఎక్కువ.  ఎక్కువగా తింటే బరువు పెరగడానికి దారి తీస్తుంది.

తియ్యగా ఉన్న ద్రాక్షలో కేలరీలు ఎక్కువ.  ఇది కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది.

సపోటా పండ్లలో చక్కెర శాతం ఎక్కువ.  పరిమితికి మించి తింటే బరువు పెరగడం ఖాయం.

పనస తొనలు కూడా ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి.  వీటిని లిమిట్ దాటి తింటే బరువు పెరుగుతారు.

లిచీ పండ్లలో ఫైబర్ చాలా తక్కువ, తీపిశాతం ఎక్కువ.  అందుకే ఇవి కూడా బరువును పెంచుతాయి.

ఖర్జూరాలలో సహజ చక్కెరలు ఎక్కువ.  వీటిని ఎక్కువగా తింటే బరువు పెరగడానికి కారణం అవుతాయి.

దానిమ్మ విత్తనాలు తింటే పర్లేదు.. కానీ జ్యూస్ తాగితే మాత్రం  ఎక్కువ కేలరీలు శరీరంలో వెళ్లడానికి దారి తీస్తాయి.

ఎండిన అంజీర్ పండ్లు తియ్యగా ఎక్కువ కేలరీలు కలిగి ఉంటాయి.  వీటిని ఎక్కువ తీసుకుంటే నష్టం తప్పదు.