ఇవి తింటే కొవ్వు తగ్గి..  రక్త సరఫరా మెరుగుపడుతుంది..

దాల్చిన చెక్క రక్తనాళాలను శుభ్రపరిచి రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.

వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. 

 సాల్మన్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.

ఉల్లిపాయలు యాంటీ-ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. 

దానిమ్మలో పాలీఫెనాల్ యాంటీ-ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలకు రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి.

రెడ్ పెప్పర్ రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్తనాళాల్లోని కొవ్వును కరిగిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.

 టమాటాల్లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.