మాంసాహారం ఎక్కువగా తినేవారికి ఇన్ని రోగాలు వస్తాయా..!

చాలామందికి నాన్ వెజ్ అంటే ఇష్టం. కానీ దాన్ని ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆహార నిపుణులు అంటున్నారు.

మాంసాహారంలో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది.  ఇది కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం పెంచుతుంది.

మాంసాహారంలో కేలరీలు, కొవ్వులు,  ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.  ఇవి ఊబకాయానికి దారితీస్తాయి.

మాంసాహారం ఎక్కువ తినేవారిలో టైప్-2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది.

రెడ్ మీట్,  ప్రాసెస్ చేసిన మాంసం తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

మాంసాహారం ఎక్కువ తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ,  జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తాయి.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి మాంసాహారం కారణం అవుతుంది.

మాంసాహారం ఎక్కువగా తింటే కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.  లివర్, కిడ్నీ వ్యాధులు వస్తాయి.

మాంసాహారంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది.  ఇది బీపీ పెరగడానికి కారణం అవుతుంది.

మాంసాహారం ఎక్కువ తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.