వేసవిలో కొన్ని కూరగాయలు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అలాంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

పచ్చి, ఎండు మిరపకాయలు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. వేసవిలో వీటిని తగ్గించడం మంచిది. 

క్యాబేజీ, కాలీఫ్లవర్ ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. వీటిని కూడా తక్కువగా తీసుకుంటే మంచిది. 

ఆకు పచ్చ కూరగాయలు ఆరోగ్యానికి మంచిదైనా వేసవిలో తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. 

వేసవిలో బంగాళదుంపలను తక్కువగా తీసుకోవాలి. 

అల్లం ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల కూడా వేడి పెరిగే ప్రమాదం ఉంది. 

క్యారెట్లు కూడా శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. కాబట్టి వీటిని కూడా మితంగా తీసుకోవాలి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.