కళ్లు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే చాలామంది కంటి సమస్యలతో బాధపడుతుంటారు.

40ఏళ్లు దాటగానే చాలామందికి ప్రెస్బియోపియా వస్తుంది. అలాంటి వారు కళ్లజోడు లేకుండా చదవలేరు.

ఆ సమస్యకు ముంబైకి చెందిన ఎన్‌టాడ్‌ ఫార్మా కంపెనీ 'ప్రెస్‌వూ' పేరిట చుక్కల మందు తయారు చేసింది.

దానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వడంతో అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది.

ఒక్క చుక్క డ్రాప్స్ వేస్తే చాలు ఆరు గంటలపాటు కళ్లు స్పష్టంగా కనిపిస్తాయని సంస్థ సీఈవో నిఖిల్‌ తెలిపారు.

మరో నెల రోజుల్లో ఇది మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుండగా.. ధర రూ.350గా నిర్ధారించారు.

అమెరికాలో 'వ్యూటీ' పేరుతో 2022లోనే ఈ తరహా ఐ డ్రాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

కాగా ఇండియాలో తయారైన మొట్టమొదటి ప్రెస్బియోపియా ఐ డ్రాప్స్‌గా ప్రెస్‌వూ నిలవనుంది.

దుష్ప్రభావాలు ఉండవని తయారీలో ‘పైరోకార్బన్‌’ మాలిక్యూల్‌ ఉపయోగించినట్లు సంస్థ తెలిపింది.

కంట్లో వేస్తే 'డెప్త్‌ ఆఫ్‌ ఫీల్డ్‌' పెరిగి కళ్లజోడు అవసరం లేకుండానే పనులు చేసుకోవచ్చని తెలిపింది.