వేసవిలో తెగవాడేసే AC దుష్పభావాలు ఆరోగ్యంపై ఎలా ఉంటాయంటే..!

ఎయిర్ కండిషనింగ్ వేడి ఉష్ణోగ్రతల నుంచి ఉపషమనాన్ని అందిస్తుంది. అయితే ఇది ఆరోగ్యంపై వివిధ రకాల దుష్పభావాలను కలిగిస్తుంది

ఏసీ వల్ల చర్మం పొడిబారే సమస్య ఉంటుంది. గాలిలో తేమ స్థాయి తగ్గడం వల్ల చర్మం పొడిబారుతుంది.

శ్వాస ఇబ్బందులు కూడా ఏసీ కారణంగా కలుగుతాయి. గురక, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. గాలిని చల్లబరచడం, తేమ స్థాయిలను తగ్గించడం వల్ల డీహైడ్రేషన్ కలుగుతుంది.

గదిలో చల్లని గాలి వలన తలనొప్పి కూడా పెరుగుతుంది. 

చల్లటి గాలి కారణంగా కండరాలు సంకోచించి గట్టి పడతాయి. ఇది అసౌకర్యాన్ని కలుగజేస్తుంది.

ఎయిర్ కండిషన్డ్ పరిసరాల్లో ఎక్కువ సమయం ఉండటం కారణంగా శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి అలసటగా అనిపిస్తుంది.

చల్లటి గాలి వలన  కళ్ళకు చికాకు కలుగుతుంది.

పొడి గాలి గొంతులోని శ్లేష్మ పొరలను పొడిగా మారుస్తుంది. ఇది పుండ్లు పడేందుకు కూడా కారణం కావచ్చు.