మైగ్రేన్ లేదా పార్శ్వనొప్పి కారణంగా నిత్యం అనేక మంది అవస్థలు పడుతుంటారు

తలలో ఒకవైపు వచ్చే నొప్పితో పాటు కొందరు వాంతులు, కాంతిని చూడలేక ఇబ్బంది ఎదుర్కొంటారు

ఈ నొప్పి కొన్ని గంటల నుంచి రోజుల పాటు వేధిస్తుంది

అయితే, మందులతో పాటు కొన్ని రకాల కసరత్తులు కూడా ఈ నొప్పి నుంచి సాంత్వన కలిగిస్తాయి

బాలాసనంతో వెన్నెముక సాగి మెదుడలో కూడా ఒత్తిడి తగ్గుతుంది. 

బ్రిస్క్ వాకింగ్‌తో ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి తగ్గి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది

బితిలాసనంతో కూడా పార్శ్వ నొప్పి తగ్గుతుందని అనుభవజ్ఞులు చెప్పేమాట 

శవాసనం, నడుము మెడను పక్కకు వంచడం వల్ల కూడా ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది.