తాటి పండ్ల గురించి సిటీల్లో ఉండే వారి కంటే గ్రామాల్లో ఉండే వారికే బాగా తెలుసు.

తాటి చెట్టు నుంచి తాటి ముంజలు, కల్లు, తాటి తాండ్ర, బెల్లం వంటివి లభిస్తాయి.

తాటి పండులో ఉండే పోషకాల ద్వారా చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు.

తాటి పండులో జింక్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్లు ఎ, బి, సి సమృద్ధిగా ఉంటాయి.

తాటి పండు తినడం వల్ల ఎముకలు బలంగా, దృఢంగా మారుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

ఎండా కాలంలో దీన్ని తింటే శరీరానికి చలువ చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లు వంటివి దరి చేరకుండా ఉంటాయి.

తాటి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ నిరోధకంగా పనిచేస్తాయి.

మలబద్ధకం, పేగు సంబంధిత వ్యాధులను నయం చేయడంలో తాటి పండు మంచి పాత్ర పోషిస్తుంది.

క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండటం వల్ల దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.