కొంత మంది ఏం చేసినా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా సరే ముఖం జిడ్డుగానే ఉంటుంది.
ముఖం జిడ్డుగా మారడానికి చర్మం ఉత్పత్తి చేసే సీబమ్ కారణం.
మాయిశ్చరైజర్, మార్కెట్‌లో దొరికే రకరకాల క్రీములు వాడినా కొంతమందికి ఫలితం ఉండదు.
అయితే కొన్ని టిప్స్ వాడి ఈజీగా జిడ్డు సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెప్తున్నారు.
గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సీబమ్ఉత్పత్తి తగ్గించి జిడ్డుగా మారకుండా చేస్తుంది.
పాలను ముఖానికి అప్లై చేసి పావుగంట తర్వాత కడగడం ద్వారా జిడ్డుదనం పోతుంది.
ముఖానికి తేనె అప్లై చేసి 15నిమిషాల తర్వాత కడగడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
నీళ్లలో నిమ్మరసం కలిపి లేదా నిమ్మరసం ఐస్‌క్యూబ్‌తో ముఖాన్ని రుద్దినా ఫలితం ఉంటుంది.
కొబ్బరిపాలు ముఖానికి రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.
నీళ్లలో చెంచా ఉప్పు కలిపి నీటిని ముఖంపై చల్లి కాసేపు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
ఆయిల్ స్కిన్ ఉన్నవారు సబ్బు, ఫేస్‌వాష్ ఎక్కువ వాడితే చర్మం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Related Web Stories
ఈజీగా, వేగంగా బరువు తగ్గాలని ఉందా..?
బరువు తగ్గాలనుకునే వారికి ఈ జ్యూసెస్ బెస్ట్
ఎండు ద్రాక్ష కలిపిన పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో.. అవి ఏమిటో తెలుసా?
ఒక్క జామకాయ తినడం వల్ల ఎన్ని లాభాలంటే..