శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్ మించి ఉంటే ఆ స్థితిని జ్వరమని అంటారు.

వైరస్‌, బ్యాక్టీరియాలతో రోగనిరోధక శక్తి పోరాటం చేసేటప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది.

జ్వరం వస్తే మన దేశంలో పారాసెటమాల్ మాత్రలు ఎక్కువగా వినియోగిస్తుంటారు.

తలనొప్పి, జ్వరం, కీళ్లు, కండరాల నొప్పులు వంటి రోగాలను పారాసెటమాల్ తగ్గిస్తుంది.

అయితే దీని వల్ల లాభాలతోపాటు, నష్టాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

పారాసెటమాల్ వేసుకుంటే మైకం, మగత, వికారం, అజీర్ణం, అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది.

కాలేయం, మూత్రపిండాలు, శ్వాసకోశ సమస్యలు, చర్మం ఎర్రబడటం, దురద వచ్చే అవకాశం ఉంది.

ఈ దుష్ప్రభావాలు అందరిలోనూ కనిపించకపోవచ్చు. కొంతమందికి తీవ్రమైన నష్టం కలిగించవచ్చు.

అయితే జ్వరం వచ్చినప్పుడు వైద్యుల సలహా మేరకే పారాసెటమాల్ తగిన మోతాదులో వేసుకోవాలి.