మయోనీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఆహార పదార్థం.

ఇది సాండ్విచ్లు, బర్గర్లు, సలాడ్‌లు వంటి వాటితో ఉపయోగించే సాస్.

దీన్ని గుడ్లు, నూనె, సిట్రస్ రసాయనాల సమ్మేళనంతో తయారు చేస్తారు.

మయోనీస్‌‌లో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి.

మయోనీస్ తరచూ తింటే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

దీనిలోని సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ శరీర బరువు పెరిగేలా చేస్తాయి.

తద్వారా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

సాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ అధిక రక్తపోటుకు కారణం అవుతాయి.

దీన్ని తరచూ తింటే టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం ఉంది.

మయోనీస్ అధికంగా తింటే పింపుల్స్, చర్మ సమస్యలకు దారి తీస్తుంది.