ప్రకృతికి దూరమవుతున్నారా..  పచ్చటి ప్రాంతాల్లో నడిస్తే ఎంత మంచిదో తెలుసా 

ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి ప్రకృతికి దూరమవుతున్నాడు. ఊళ్లలో పచ్చటి పంట పొలాల నడుమ నడుస్తుంటే కలిగే భావన చెప్పలేనిది. 

పచ్చటి ప్రాంతాల్లో నడిస్తే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అలా చేస్తే కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. 

పచ్చటి పొలాల మధ్య నడకతో ఊబకాయం అదుపులో ఉంటుంది.  

గుండె ఆరోగ్యం పెరుగుతుంది. షుగర్ జబ్బు, చెడు కొవ్వు పేరుకుపోయే సమస్య తగ్గుతుంది.

ప్రకృతిని అణువణువునా ఆస్వాదిస్తే రోగనిరోధక శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన, మానసిక కుంగుబాటు దూరమవుతుంది.  

మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. కాబట్టి.. ఎంత బిజీగా ఉన్నా.. వారానికోసారైనా ప్రకృతి ఒడిలో సేదతీరండి.