చవకైన ప్రయాణ సాధనంగా పేరుపడ్డ భారతీయ రైళ్లల్లో అత్యంత వేగవంతమైనవి ఏవంటే..

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు

ఢిల్లీ, వారణాసి వంటి ప్రధాన నగరాలకు ఈ రైలు సర్వీసు అందుబాటులో ఉంది

తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు గరిష్ఠ వేగం గంటకు 200 కిలోమీటర్లు

ముంబై, గోవా, చెన్నై మధురై నగరాల మధ్య ఈ సర్వీసు అందుబాటులో ఉంది

ఢిల్లీ, ఝాన్సీల మధ్య చెక్కర్లు కొట్టే గతిమాన్ ఎక్స్‌ప్రెస్ గరిష్ఠ వేగం గంటకు 160 కిలోమీటర్లు

ఢిల్లీ, భోపాల్ మధ్య నడిచే భోపాల్ శతాబ్దీ ఎక్స్‌ప్రెస్ గరిష్ఠ వేగం గంటకు 150 కిలోమీటర్లు

ముంబై ఢిల్లీ మధ్య నడిచే విలాసవంతమైన రాజధాని ఎక్స్‌ప్రెస్ గరిష్ఠ వేగం గంటకు 140 కీమీలు