పిల్లలకి జ్ఞాపకశక్తి
పెరగాలంటే ఇవి తినిపించండి..!
మెదడు ఆరోగ్యంగా ఉండడానికి ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అవసరం.
ఇవి అధికంగా లభించే చేపలు, చేప నూనె, గుడ్లు, అవిసె గింజలు, ఆక్రోట్ గింజలు తీసుకోవాలి.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పుచ్చ, దానిమ్మ, బొప్పాయి, రోజూ కనీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి.
పసుపులో క్యార్క్యుమిన్ అనే పదార్థం మెదడు ఆరోగ్యానికి మంచిదని పరిశోధనలు తెలుపుతున్నాయి.
జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్ లాంటి ఖనిజాలు ఉండే అన్ని రకాల గింజలు జ్ఞాపకశక్తికి ఉపయోగపడతాయి.
కోడిగుడ్లలో పుష్కలంగా లభించే కొలిన్ అనే విటమిన్ మెదడు ఆరోగ్యానికి మంచిది.
మంచి ఆహారపు అలవాట్లతో పాటు మంచి నిద్ర, శారీరక శ్రమ, ఆందోళన లేని జీవితం మెదడు ఆరోగ్యానికి అత్యవసరం.
మెదడుకు పదును పెట్టే పజిల్స్, సంగీతం, చిత్రకళ లాంటి ఏవైనా కొత్త సృజనాత్మక హాబీలు అలవర్చుకోవడం వల్ల జ్ఞాపక శక్తి బాగుంటుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలను తరచూ వేరే పిల్లలతో లేదా ఇంట్లో వాళ్ళతో చర్చించడం ద్వారా కూడా జ్ఞాపకశక్తి బాగుంటుంది.
Related Web Stories
మీ మెదడు షార్ప్‌గా ఉండాలంటే.. ఈ 5 వస్తువులను కాల్చి తింటే చాలు..
మయోనీస్తో ఇంత డేంజరా
పీసీఓడీ నుంచి ఉపశమనం కలిగించే పానీయాలు ఇవే..!
పెసరపప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!