గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగేందుకు పాటించాల్సిన హోమ్ రెమిడీస్ గురించి తెలుసుకుందాం. 

పాలలో పసుపు కలిపి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, మంట తగ్గుతుంది. 

తులసి ఆకులను మరిగించిన నీటిని తాగడం వల్ల కూడా గొంతు నొప్పి తగ్గుతుంది. 

గ్లాసు గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరపం కలిపి తాగితే బాగా పని చేస్తుంది. 

గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే గొంతులో వాపు, నొప్పి తగ్గుతుంది. 

తేనె, అల్లం కలిపి తీసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

అల్లం టీ తాగడం వల్ల గొంతులో మంట, నొప్పి తగ్గుతుంది. 

ఆవిరి పట్టడం వల్ల కూడా గొంతులో పేరుకుపోయిన శ్లేష్మం తొలగిపోయి, శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.