గుండె సమస్యల నుండి వేగంగా కోలుకోవాలంటే ఈ 7 టిప్స్ పాటించండి..!

నేటికాలంలో గుండె సమస్యలు సాధారణం అయిపోయాయి.  వీటి నుండి వేగంగా కోలుకోవాలంటే 7 టిప్స్ తప్పక పాటించాలి.

గుండె జబ్బుల నుండి వేగంగా కోలుకోవడానికి ఆకుకూరలు,  కాయధాన్యాలు,  తృణధాన్యాలు,  గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు తీసుకోవాలి.  

గుండె జబ్బుల నుండి కోలుకుంటున్న వ్యక్తులు తమ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి.  ఒమేగా-3,  ఆలివ్ ఆయిల్,  వాల్నట్స్, బాదం మొదలైనవి తీసుకోవాలి.

ఉప్పు తక్కువగా తినాలి.  ఇందులో సోడియం ఎక్కువ ఉంటుంది.  ఇది రక్తపోటును పెంచి గుండె ప్రమాదం మరింత పెంచుతుంది.

చిక్కుళ్లు, గింజలు,  గుడ్లు వంటి ప్రోటీన్ ఆహారాలు సమృద్దిగా తీసుకోవాలి.  ఇవి గుండె జబ్బుల ప్రమాదం తగ్గించడంలో సహాయపడతాయి.

హైడ్రేట్ గా ఉండటం వల్ల గుండె పనితీరు బాగుంటుంది.  రక్తనాళాల ద్వారా రక్తాన్ని సులభంగా పంప్ చేయగలుగుతుంది. నీరు బాగా తాగాలి.

చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉంటే ఆహారం విషయంలో జాగ్రత్తల కోసం డైటీషియన్ ను సంప్రదించాలి.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జాకింగ్, వాకింగ్,  వ్యాయామం వంటివి ఫాలో అవ్వాలి.