ఎముకలు ఉక్కులా దృఢంగా మారాలంటే ఇవి అలవాటు చేసుకోండి..!

వయసు పెరిగేకొద్దీ శరీరంలో బోలెడు మార్పులు జరుగుతాయి.  ఎముకలు బోలుగా,  బలహీనంగా మారుతాయి.  అయితే కొన్ని అలవాట్లతో ఎముకలను బలంగా మార్చుకోవచ్చు.

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం, విటమిన్-డి  బాగా తీసుకోవాలి. ఆహారంలో పాలు, పెరుగు, వెన్న,  చీజ్ ,  ఆకుకూరలు, గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి.

బరువులు ఎత్తడం, పరిగెత్తడం, వారానికి 3-4 సార్లు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు ఎముకల సాంద్రతను పెంచుతాయి.

ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు ఎండలో కూర్చోవాలి. దీనివల్ల విటమిన్-డి బాగా లభిస్తుంది. ఎముకలు బలంగా ఉంటాయి.

ధూమపానం, మద్యపానం అలవాట్లు ఎముకలను దెబ్బతీస్తాయి.  వీటికి దూరంగా ఉండాలి.

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర ముఖ్యం.

ఒత్తిడి వల్ల ఎముకలు బలహీనపడతాయి.  ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగ, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి.

ఊబకాయం, అధికబరువు ఎముకలపై ఒత్తిడి కలిగిస్తుంది.  ఇది ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడంలో సహాయపడుతుంది.

40ఏళ్లు దాటిన తరువాత ప్రతి ఒక్కరూ ఎముకల సాంద్రతకు సంబంధించిన పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు ముందే తెలుసుకుని వాటికి చికిత్స చేయించుకోవచ్చు.