వెన్నునొప్పి చాలా ప్రమాదకరమైనది. అది మొదట్లో వెన్నుకు మాత్రమే వస్తుంది. దాన్ని తేలిగ్గా తీసుకుంటే క్రమంగా అది చేతులు, కాళ్లకు కూడా వ్యాపిస్తుంది.
ఎక్కువ సేపు కూర్చొని పనిచేసేవారికి ఇది వస్తుంది. అలాగే.. ఎక్కువ బరువులు మోసేవారికి కూడా ఈ సమస్య ఉంటుంది.
ఎక్కువ టైం డ్రైవింగ్ చేసినా ఈ సమస్య వస్తుంది. ఇది రావడానికి ప్రధాన కారణం.. కండరాలు అలసిపోవడమే. సరైన ఎక్సర్‌సైజ్ చేయకపోతే వెన్నునొప్పి పెరుగుతూ ఉంటుంది.
కండరాలపై ఒత్తడిని పెంచుతుంది. వెన్ను నొప్పి వచ్చిన వారికి నిల్చున్నా, కూర్చున్నా, ఏ పని చేద్దామన్నా, ఆ నొప్పి కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
అయితే, చాలా వరకూ మనం తీసుకునే ప్రత్యేక చర్యలతో బ్యాక్ పెయిన్ కాస్త తగ్గిపోతుంది. అవేంటో తెలుసుకుందాం..
నిఠారుగా కూర్చోండి: పని ప్రదేశంలో నిఠారుగా కూర్చోండి. అలాగే నిల్చున్నప్పుడు కూడా పక్కకి వంగకండి. నిఠారుగా కూర్చోవడం వల్ల వెన్నెపూసపై భారం తగ్గుతుంది.
తద్వారా బ్యాక్ పెయిన్ పెద్దగా రాదు. మీ తలను తిన్నగా పైకి ఉంచండి. రోజూ చేతులు, కాళ్లూ కదిలేలా చిన్న చిన్న ఎక్సర్ సైజులు చేయండి.
ఆహారం: వెన్ను నొప్పి ఉన్న వారు మంచి ఆహారం తీసుకోవాలి. మాంసాహారం కంటే, శాఖాహారం ఎంతో మంచిది. కొవ్వు ఉండే ఆహారాలు అస్సలు తినవద్దు. గింజలు, పప్పుల వంటివి ఎక్కువగా తినండి.
మీ ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలతో పాటూ, అవిసె గింజలు, సబ్జా గింజలు ఉండేలా చూసుకోండి. కాలానుగుణంగా వచ్చే పండ్లను కూడా క్రమం తప్పక తినండి.
ఎక్సర్‌సైజ్: ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. ఎన్ని పనులు ఉన్నా సరే వ్యాయామానికి కాస్త టైమ్ కేటాయించండి.
వెన్నునొప్పి, 20 నిమిషాలకు పైగా ఉంటే మాత్రం డాక్టర్‌ని కలవడం మంచిది.
బాగా నిద్రపోండి: నిద్రపోయినప్పుడు మనకు చాలా రకాల రోగాలను నయం చేస్తుంది. మన శరీరం తగిన విశ్రాంతి తీసుకుంటే కండరాలన్నీ కొత్త ఉత్తేజం తెచ్చుకుంటాయి.
కాబట్టి నిద్రను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలైనా నిద్రపోవాలి.
ఒత్తిడిని తగ్గించుకోండి: చాలా మంది పని ఒత్తడి ఎక్కవై బాగా టెన్షన్ పడుతుంటారు. అలాంటి వారికి మెదడుపై ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. తద్వారా బాడీ మొత్తం ఆ ప్రభావం పడుతుంది.
ముఖ్యంగా మెడనొప్పి, భుజాలను వెన్ను నొప్పి వెంటాడుతుంది. అందుకే టెన్షన్ పెరిగినప్పుడు పని కాసేపు ఆపండి. మీకు నచ్చిన సాంగ్స్ ఏమైనా వినడం, నచ్చిన వాళ్లతో మాట్లాడితే కాస్త రిలీఫ్ అవుతారు.
కూర్చున్న చోట నుంచి లేచి, అలా ఓ రౌండ్ వేసి రండి. ఇలా చేయడం వల్ల వెన్ను నొప్పికు చెక్ పెట్టవచ్చు.