చలికాలంలో జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు పాటించండి

వింటర్ హెయిర్ కేర్: వేడి నీళ్లతో తలస్నానం చేయడం, హెయిర్ డ్రైయర్స్, ఉన్ని బట్టలు వాడటం ఇవన్నీ చలికాలంలో జుట్టు డ్యామేజ్ కావడానికి కారణాలు.

చలికాలంలో జుట్టు సంరక్షణ విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. 

చలికాలంలో ఉన్ని టోపీ ధరించడం వల్ల జుట్టు చిట్లుతుంది. అలా కాకుండా మీరు టోపీ పెట్టుకునే ముందు శాటిన్ స్కార్ఫ్ ధరించండి. 

ఇది చలి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. జుట్టు కూడా పాడైపోదు. 

చలికాలంలో తలస్నానం చేయడం చాలా పెద్ద పని. కాబట్టి, కొంతమంది హెయిర్ కండీషనర్‌ను అప్లై చేయరు. 

 అయితే చలికాలంలో మాత్రం హెయిర్ కండీషనర్‌ను తప్పకుండా అప్లై చేయండి. ఇది జుట్టును పునరుజ్జీవింపజేస్తుంది.

శీతాకాలంలో జుట్టును త్వరగా ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్లను ఉపయోగిస్తారు. 

 కానీ, ఇది ఏ మాత్రం మంచిది కాదు. హెయిర్ డ్రైయర్ మీ జుట్టును చాలా డ్యామేజ్ చేస్తుంది.

జుట్టుకు నూనె రాసుకుని బయటకు వెళ్లడం వల్ల చుండ్రు సమస్య పెరుగుతుంది. 

దీన్ని నివారించడానికి, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ జుట్టుకు నూనెతో మసాజ్ చేయండి.

చలికాలంలో తప్పకుండా హెయిర్ స్పా తీసుకోండి. హెయిర్ స్పా అనేది ఆయిల్ మసాజ్, స్టీమింగ్, షాంపూ, కండీషనర్ మొదలైన వాటి పూర్తి కలయిక.