చాలా మంది చిన్న, పెద్ద విషయాలకు తరచూ కోపం తెచ్చుకుంటుంటారు.

కోపం సహజ భావోద్వేగం అయినప్పటికీ నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.

లేకుంటే శారీరక, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం పడుతుంది.

తరచూ కోపం తెచ్చుకుంటే కుటుంబసభ్యులు, స్నేహితులతో విభేదాలు తప్పవు.

ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, చట్టపరమైన సమస్యలకు దారి తీయెుచ్చు.

ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక సమస్యలు తీవ్రతరమై ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి.

కోపాన్ని నియంత్రించేందుకు ధ్యానం, వ్యాయామం, వాకింగ్ వంటివి సహాయపడతాయి.

మనసును ప్రశాంతంగా ఉంచుకుని సానుకూల ఆలోచనలు మాత్రమే చేయాలి.

కోపాన్ని నియంత్రించడంలో సమస్యలు ఎదురైతే మానసిక వైద్యులను సంప్రదించండి.