వయసు పెరిగేకొద్దీ చర్మం ముడతలు పడుతుంది. 40ఏళ్ల దాటినా చర్మం యవ్వనంగా ఉండాలంటే ఈ పనులు చేయండి. 

ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండేందుకు సన్‌‌స్క్రీన్ లోషన్‌లను అప్లై చేయాలి. 

రాత్రి పడుకునే ముందు రెటినోల్ సీరమ్‌ను చర్మంపై అప్లై చేయాలి. 

ఉదయం లేచిన తర్వాత విటమిన్-సి సీరంను అప్లై చేయాలి. 

చర్మం పొడిబారకుండా ఉండేందుకు సిరామైడ్, గ్లిజరిన్‌తో కూడిన మాయిశ్చరైజ్‌ను వినియోగించాలి. 

పోషకాహారం తీసుకోవడంతో పాటూ రోజూ 7 నుంచి 8 గ్లాసుల నీరు తీసుకోవాలి. 

రోజుకు చర్మాన్ని రెండు సార్లు శుభ్రపరచాలి. ఇందుకోసం చల్లని నీటిని ఉపయోగించాలి. 

బాదం నూనెలోని విటమిన్-ఇ.. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.