392fad11-81aa-40e7-91d2-b5317e4f531e-infection2.jpg

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..!

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేద మూత్రాశయం, మూత్రనాళం,  మూత్ర పిండాలతో సహా మూత్ర వ్యవస్థలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రావడం.

యూరినరీ ట్రాక్ ఇన్పెక్షన్ మహిళలలో ఎక్కువగా  ఉంటుంది.

పదే పదే మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి రావడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, యోని దురద, కడుపు నొప్పి, దుర్వాసనతో కూడిన మూత్రం వంటి లక్షణాలు ఉంటాయి.

యూరినరీ ట్రాక్ ఇన్పెక్షన్ తగ్గించుకోవాలంటే పరిశుభ్రత చాలా ముఖ్యం.

బాక్టీరియా మూత్రనాళానికి వ్యాపించకుండా టాయిలెట్ ఉపయోగించిన ప్రతి సారి ముందు నుండి వెనుకకు తుడవాలి.

నెలసరి సమయంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు శానిటరీ ప్యాడ్ లేదా టాంపాన్ వంటివి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.

హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల మూత్ర వ్యవస్థ నుండి బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. ఇందుకోసం రోజుకు 8గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి.

క్రాన్బెర్రీ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది యూరినరీ ట్రాక్ ఇన్పెక్షన్ ను తగ్గిస్తుంది.

పెరుగు, మజ్జిగ,  పులియ బెట్టిన ఆహారాలలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్పెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మూత్రవిసర్జన చెయ్యాల్సి వచ్చినప్పుడు దాన్ని బలవంతంగా ఆపుకోకూడదు. ఇది ఇన్పెక్షన్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

లో దుస్తులను బిగుతుగా ఉన్నవి వేసుకోకూడదు.  కాటన్ లో దుస్తులను ఉపయోగించడం వల్ల అవి తేమను గ్రహించి బ్యాక్టీరియా పెరుగుదలను అరికడతాయి.