వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల లిస్ట్ ఇదీ..!
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. వీటిని ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. ఇందుకోసం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి.
పసుపు గొప్ప యాంటీ ఆక్సిడెంట్. ఇందులో ఉండే కర్కుమిన్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పసుపు పాలు, పసుపు నీరు మొదలైనవి బాగా తీసుకోవాలి.
తేనె.. రుచిగానే కాకుండా ఔషద గుణాలు కూడా కలిగి ఉంటుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి. తేనెను ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.
వర్షాకాలం సీజన్ లో మాత్రమే లభించే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
అల్లం గొప్ప యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలోనూ, రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది.
తులసి ఆయుర్వేదంలో గొప్ప మూలికగా పిలవబడుతుంది. తులసిని నీటిలో మరిగించి తాగినా, తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. దీన్ని పచ్చిగా లేదా ఆహారంలో భాగంగా తీసుకున్నా రోగనిరోధక శక్తని బలంగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే వ్యాయామం, యోగా చేయడం కూడా ముఖ్యం. రోజు అరగంట నుండి గంట సేపు వ్యాయామం లేదా యోగా చేస్తే రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది.