ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 

గ్లాసు నీటిలో బేకింగ్ సోడా మిక్స్ చేసి తాగితే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. 

అల్లం టీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎసిడిటీ సమస్యను తగ్గిస్తాయి.

అరటిపండులోని సహజసిద్ధ యాంటాసిడ్లు ఎసిడిటీని తగ్గించి పొట్టకు ఉపశమనం కలిగిస్తాయి.

చల్లటి పాలు తాగినా కూడా ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. 

మిరియాలను పాలలో కలుపుకొని తాగినా కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది.

దాల్చిన చెక్కను మరిగించిన నీటిని తాగినా ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.